యూపీలోని లక్నోలో శనివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. ఓ పాల వ్యాపారి పాలను కస్టమర్లకు డెలివరీ చేసే ముందు అందులో ఉమ్మి వేశాడు. కస్టమర్ ఇంటి బయట నిల్చుని, తనను ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇలా చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రతినిధి శిశిర్ చతుర్వేది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మొహమ్మద్ షరీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.