విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులు ఏర్పాటు చేయనుంది. తొలి దశలో ఒక్కో నియోజకవర్గంలో ఒక పార్కును ప్రయోగాత్మకంగా నిర్మించనుంది. అందుకు కంపెనీలు వెచ్చించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్‌ను ఉపయోగించనుంది.