హైదరాబాద్‌లోని వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. హనుమాన్ విజయయాత్ర, ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో పలు చోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు SRH vs PBKS మ్యాచ్ జరగనుంది. మరోవైపు గౌలీగూడ రామ మందిరం నుంచి హనుమాన్ ర్యాలీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.