విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

56చూసినవారు
AP: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. చినబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన మాధురికి పురిటినొప్పు రావడంతో కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డెలివరీ చేసిందని, ఆ కారణంగానే బిడ్డ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సిబ్బందిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్