AP: వైజాగ్‌లో విషాద ఘటన ఘటన జరిగింది. HPCL కూలీగా పనిచేస్తున్న వెంకటరమణ స్థానిక మాజీ సైనికుల కాలనీలో భార్య, కుమార్తెతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీన ‘మావయ్య బిర్యానీ తెచ్చాడు చూడమ్మా’ అంటూ చెప్పడంతో కుమార్తె గ్రీష్మ మేడపైకి వెళ్లింది. కిందికి చూస్తున్న క్రమంలో కాలుజారి కిందపడింది. చిన్నారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.