AP: ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఉంగుటూరులో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులను తాళ్లముదునూరుపాడుకు చెందిన తాడి వెంకటరమణారెడ్డి(60), విమలాదేవి (52)లుగా గుర్తించారు. వారి ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.