తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యువాత పడ్డారు. దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లి వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో తిరుమలాపూర్‌కు చెందిన తండ్రి వేణు, కొడుకు శివ (14) మృతి చెందారు. బైక్‌పై వెళుతున్న వారు రోడ్డు దాటుతుండగా లారీ ఢీక్టొటింది. ఒకేసారి తండ్రీకొడుకులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.