విషాదం.. సరస్సులో మునిగి ఐదుగురు మృతి

68చూసినవారు
విషాదం.. సరస్సులో మునిగి ఐదుగురు మృతి
గుజరాత్‌లోని పఠాన్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర విషాదం జరిగింది. ఓ సరస్సులో మునిగి నలుగురు చిన్నారులు, మహిళ చనిపోయారు. చనాస్మా తాలూకా వడవాలి గ్రామ శివార్లలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులంతా మేకల కాపరులుగా పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు అక్కడకు చేరుకుని నలుగురు పిల్లలు సహా ఐదుగురిని సరస్సు నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్