ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరులో విషాదం చోటు చేసుకుంది. కనిమెట్ట గ్రామానికి చెందిన మధుసూదనరావు(55) ఇంటి బావిలో పాము చనిపోవడంతో శుభ్రం చేసేందుకు మోటారు బిగించాడు. తాడు తెగి బావిలో మోటారు పడిపోయింది. దాన్ని తీసేందుకు వెళ్లిన మధుసూదనరావు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని కాపాడేందుకు బావిలోకి దిగిన మేనళ్లుడు కింతలి వినోద్(20) కూడా ఊపిరాడక చనిపోయాడు. వారి మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.