బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి

81చూసినవారు
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వారిని హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన రాకేశ్, వినోద్, మదన్, రుతిక్, భరత్‌గా గుర్తించారు. మ‌ృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలకు ఇక్కడికి వచ్చారు.

సంబంధిత పోస్ట్