కావడి యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కావడి యాత్రికుల వాహనానికి షాక్ తగిలింది. ఝార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలో జరిగిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. యాత్రికుల వాహనంపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.