TG: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్లుడి మరణ వార్త విని అత్త మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన వెంకట రమణకు(40) హవేలీ ఘనపూర్‌కు చెందిన అయ్యవారి వెంకన్న అన్నయ్య కుమార్తె నాగ శృతితో వివాహం జరిగింది. వీరు మెదక్‌లో ఉంటున్నారు. జూన్ 12న రమణకు గుండెపోటు రాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వెంకట రమణ మామ వెంకన్న ఈ విషయాన్ని తన భార్య ఇందిరా(48)కు చెప్పగా షాక్‌కు గురై.. ఆమె గుండెపోటుతో చనిపోయింది.