ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ తల్లి లివి సురేశ్ బాబు (65) కన్నుమూశారు. కేరళలోని కూర్కెన్‌చెరిలోని తన నివాసంలో ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయాన్ని గోపి సుందర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మలయాళం సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపున్న ఆయన తెలుగులో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి, 18 పేజెస్' తదితర సినిమాలకు మ్యూజిక్ అందించారు.