మంత్రి ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం

52చూసినవారు
మంత్రి ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం
AP: మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి షహనాజ్ కన్నుమూశారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని ఇంట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్