సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని జయప్రద ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్‌లోని నివాసంలో రాజబాబు గురువారం సాయంత్రం మరణించినట్లు వెల్లడించారు. తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని జయప్రద ప్రార్థించారు.