బీహార్ ముంగేర్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. ఆశిష్ కుమార్ (30)కు ఫిబ్రవరి 13న పాట్నాకు చెందిన యువతితో వైభవంగా పెళ్లి జరిగింది. 17న రిసెప్షన్ వేడుకను సైతం ఘనంగా నిర్వహించారు. అనంతరం గదిలోకి వెళ్లి ఆశిష్ పడుకున్నాడు. తెల్లవారు జామున ఆశిష్‌ను కుటుంబ సభ్యులు లేపగా, అతడు లేవలేదు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు తెలిపారు.