విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి

60చూసినవారు
విషాదం.. గోడ కూలి ఇద్దరు మృతి
AP: విజయనగరం జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. గంట్యాడ మండలం రామవరంలో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి అనే వ్యక్తి ఇంటి గోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీలపై పడింది. దీంతో కొలుసు పైడితల్లి (45), ఎర్ర చిన్నయ్య పైడితల్లి(61)లు అక్కడికక్కడ మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్