విషాదం.. ప్రియుడు మోసం చేశాడని యువతి బలవన్మరణం

79చూసినవారు
విషాదం.. ప్రియుడు మోసం చేశాడని యువతి బలవన్మరణం
TG: నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని మల్లేశ్వరి అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మల్లేశ్వరి, జాన్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ప్రియుడు జాన్ రెడ్డి, మల్లేశ్వరిని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మల్లేశ్వరి మనస్తాపం చెంది హాస్టల్‌లో మత్తు ఇంజక్షన్ తీసుకుని చనిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు జాన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్