దారుణం.. తల, చేయి తెగిపోయి మహిళ మృతి

67చూసినవారు
దారుణం.. తల, చేయి తెగిపోయి మహిళ మృతి
బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలోంచి తల, చేతులు బయట పెట్టడం ఎంత ప్రమాదమో తెలిపే ఘటన కర్ణాటకలోని మైసూర్‌ జిల్లా సింధువల్లి గ్రామం వద్ద శనివారం చోటు చేసుకుంది. బస్సులో వెళ్తున్న శివలింగమ్మ(58)కి వాంతు రావడంతో తల బయట పెట్టింది. అదే సమయంలో ఆ బస్సును ఓ టిప్పర్ ఓవర్ టేక్ చేసింది. టిప్పర్ ఢీకొనడంతో ఆమె తల, చేతులు తెగిపోయాయి. తీవ్రంగా గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్