దారుణం.. లైంగిక దాడిలో యువతి మృతి

585చూసినవారు
దారుణం.. లైంగిక దాడిలో యువతి మృతి
కేరళలో మరో దారుణం వెలుగుచూసింది. చొట్టనిక్కరలో ప్రియుడు లైంగిక దాడి చేయడంతో ప్రియురాలు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గత సోమవారం తన ఇంట్లో యువతి తీవ్రంగా గాయపడి ఉంది. కుటుంబసభ్యులు గమనించి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ యువతి నేడు మరణించింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రియుడు లైంగిక దాడి చేయడంతోనే ఆమె మరణించినట్లు తేల్చి అతడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్