తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటి జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులన్నింటినీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీబీఐ కోర్ట్ ఆదేశించింది. జయలలిత మేనకోడలు జె.దీప, మేనల్లుడు జె.దీపక్ దాఖలు చేసిన పిటిషన్ను జనవరి 1న కర్ణాటక హైకోర్ట్ తోసిపుచ్చిన తరువాత సీబీఐ కోర్ట్ ఈ ఆదేశాలు జారీ చేసింది. జయలలిత పేరు మీద బ్యాంక్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, చెన్నై వేద నిలయం, డీఏ కేసు భూములు, ఎస్టేట్లు ఇలా చాలా ఆస్తులున్నాయి.