TG: రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించవచ్చని, 5 గంటల్లో బస్సులు గమ్యానికి చేరుతాయని ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్‌ఆర్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా తెలిపారు. గురువారం కొత్త ఈవీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోందని మంత్రి అన్నారు. త్వరలో HYD-BZAకు, BZA-VSKPకు బస్సులు నడుస్తాయని సూర్య ఖురానా చెప్పారు.