గిరిజన మహిళల అందంగా ఉండరని ఒడిశా CM మోహన్ మాఝి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మయూరభంజ్ జిల్లాలో జరిగిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. 'నేను తెల్లగా ఉన్న అమ్మాయినే పెళ్లాడాలని ఎప్పుడూ కోరుకున్నా. కానీ గిరిజన అమ్మాయిలు అందంగా ఉండరు. అందుకే నేను మయూరభంజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ జిల్లాతో నా అనుబంధం అలా ఏర్పడింది' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలను బాడీ షేమ్ చేసిన ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.