కొండా సురేఖపై ట్రోలింగ్.. స్పందించిన హరీశ్‌ రావు

73చూసినవారు
కొండా సురేఖపై ట్రోలింగ్.. స్పందించిన హరీశ్‌ రావు
TG: మంత్రి కొండా సురేఖపై సోషల్‌ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌‌పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ అయినా, నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్‌‌మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్‌‌మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నా’’ అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్