ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవాను ట్రోల్ చేయడం పై MLC విజయశాంతి మండిపడ్డారు. 'దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించి తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. భారత హిందూ సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు." అని ఆమె Xలో రాసుకొచ్చారు.