కూలీలపై ట్రక్కు బోల్తా.. నలుగురు మృతి

69చూసినవారు
కూలీలపై ట్రక్కు బోల్తా పడటంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్‌‌లోని బనస్కాంత జిల్లాలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆకస్మాత్తుగా బోల్తా పడింది. రేణుకాబెన్ గనవా(24), సోనాల్‌బెన్ నినామా(22), ఇలాబెన్ భభోర్ (40), రుద్ర(2) ట్రక్కు కింద చిక్కుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి, వారిని బయటకు తీశారు. ఆస్పత్రి తరలించేలోగా వారు చనిపోయారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్