వలసదారులకు ట్రంప్ స్పెషల్ ఆఫర్

63చూసినవారు
వలసదారులకు ట్రంప్ స్పెషల్ ఆఫర్
ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏం చేసినా సంచలనమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై కన్నెర్ర చేసారు. ఇప్పటికే వలసదారుల్ని కట్టడి చేశారు. అయితే అమెరికాలోని వలసదారులకు మాత్రం ఓ స్పెషల్ ఆఫర్‌ని ప్రకటించారు. స్వీయ బహిష్కరణ చేసుకునే వారికి విమాన ఖర్చులతో పాటు కొంత డబ్బును ఇస్తామని ఓ ఇంటర్వూలో తెలిపారు. చట్టపరంగా అన్నీ సక్రమంగా ఉంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్