అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'పై సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. రిపబ్లికన్ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆయన సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణ లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అన్ని వర్గాల ప్రజలకు లబ్ధికరమని, సాయుధ బలగాల నుంచి కార్మికుల వరకూ అందరికీ మద్దతుగా నిలుస్తుందన్నారు.