ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల గురించి తమకు ముందే తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. 'ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. దీనిపై ఆ దేశం చర్చలకు దిగి రావాలి. ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే ఎదుర్కొనేందుకు సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్‌ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.