మార్చి నెలలో నిర్వహించిన జూనియర్ ఇంటర్మీడియట్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను 12.04.2025 వ తేదీన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేశారు. కాగా జూనియర్ ఇంటర్మీడియట్ ఎం.ఈ.సీ ఫలితాలలో మాస్టర్మెండ్స్ విద్యార్థులు మల్లవోలు లిఖిత (HT No.2514130061) 494/500 మార్కులు, ఓ.కె. గీతిక (HT No.2514123292) 494/500 మార్కులు, మామిడిపాక హరిణి (HT No.2514130028) 494/500 మార్కులు సాధించారు. ఈ జానియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ విద్యార్థులు 490 ఆపైన మార్కులు సాధించిన వారు 88 మంది, 480 ఆపైన మార్కులు సాధించిన వారు 498 మంది, 475 ఆపైన మార్కులు సాధించిన వారు 649 మంది విద్యార్థులు ఉన్నారని మాస్టర్మెండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ సి.ఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. అదే విధంగా సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ విద్యార్థి సముద్రాల సాత్విక (HT No.2514222430) 982 మార్కులు సాధించిందన్నారు. ఈ సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ విద్యార్థులు 970 ఆపైన మార్కులు సాధించిన వారు 71 మంది, 960 ఆపైన మార్కులు సాధించిన వారు 141 మంది విద్యార్థులు ఉన్నారని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మరియు సిబ్బందిని అడ్మిన్ అడ్వైజర్ సి.ఏ మట్టువల్లి మోహన్ అభినందించారు.