TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ సభ్యులు, అధికారులతో పాలక మండలి సమీక్షించనుంది. భక్తులకు సౌకర్యాలపై అధికారులకు ఛైర్మన్ సూచనలు చేయనున్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.