శ్రీవారి దర్శనార్థం టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇటీవల కొందరు భక్తులు వారికి కేటాయించిన సమయం కంటే ముందే వచ్చి క్యూలైన్లలోకి అనుమతించాలని టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’’ అని ప్రకటనలో పేర్కొంది.