ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టీవీకే అధినేత విజయ్ కౌంటర్ వేశారు. పిఠాపురంలో శుక్రవారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలను విజయ్ తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాల భాషలపై తమకు గౌరవం ఉందని, అలా అని ఇతర భాషలను తమపై రుద్దాలని చూస్తే సహించమన్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషలను ఉత్తరాది రాష్ట్రాల్లో 3వ భాషగా పరిగణిస్తారా ? అని ప్రశ్నించారు.