టీవీఎస్ మోటార్ సంస్థ 2025 మోడల్ అపాచీ ఆర్టిఆర్ 200 4వీ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రభుత్వ ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలను అనుసరించి ఈ బైక్‌ను తయారు చేశారు. ఆధునిక టెక్నాలజీ, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ మోడల్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్ ధరను రూ.1,53,990గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ మోడల్ లభ్యమవుతుందని పేర్కొంది.