తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసులో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిన్న బీఎల్‌ఎన్ రెడ్డి, నేడు అరవింద్ కుమార్‌ను ఈడీ విచారించాల్సి ఉండగా.. హాజరయ్యేందుకు సమయం కావాలని వీరిద్దరూ కోరారు. దీంతో ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని BLN రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈనెల 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే వీరిద్దరూ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.