TG: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ చింతలకుంట వద్ద ఆదివారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనమయ్యారు. రోడ్డు పక్కన ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిపై తీగలు తెగిపడ్డాయి. పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.