హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన ఇద్దరు చిన్నారులు క్వారీ గుంతలో పడి మరణించారు. దుర్గాప్రసాద్(11), సుబ్రహ్మణ్యం(8) అరుంధతినగర్‌లో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. సమాచారం మేరకు బండబావి క్వారీలో వెతికగా.. చిన్నారుల మృతదేహాలు దొరికాయి.