TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటుచేసుకుంది. కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక మృతి చెందారు. చిన్నారులు ఆడుకుంటూ ఇంటి ముందు పార్కుచేసి ఉన్న కారులోకి వెళ్లారు. చిన్నారులు కారులోకి వెళ్ళగానే కారు డోర్‌లాక్ పడటంతో ఊపిరాడక తన్మయ శ్రీ (5), అభియన శ్రీ (4) మృతి చెందారు. చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.