మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా సిమారియాలో ఉన్న JK సిమెంట్ ప్లాంట్‌లో గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వందలాది మంది కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న భాగంలో రూఫ్ స్లాబ్‌లు వేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ కూలిపోయింది. దాని కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా.. 50 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని సమాధి అయినట్లు సమాచారం.