TG: నారాయణపేట PS పరిధి ఏక్లాస్‌పూర్ శివారున శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. నారాయణపేట నుంచి గుర్మీత్కల్‌కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపులోని సిపురానికి చెందిన భీమరాయ అనంతమ్మ(55) , నారాయణపేటకు చెందిన శిరీష(10) దుర్మరణం చెందారు. జీపులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ రేవతి ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.