ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి (వీడియో)

65చూసినవారు
ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా చాపిరేవులలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు వెంకటమ్మ, ఆరేళ్ల బాలుడు పండు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది గాయపడ్డారు. రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి సమయంలో ఇంట్లో సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో.. గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది. మంగళవారం తెల్లవారుజామున వృద్ధురాలు వెంకటమ్మ లైట్ వేయడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్