భారత వైమానిక దాడులపై పాకిస్థాన్ తాజాగా కీలక విషయాలను వెల్లడించింది. ఇటీవల గాయపడిన వారిలో మహమ్మద్ నవీద్ షాహీద్, అయాజ్ అనే ఇద్దరు సైనికులు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపింది. ఈ మేరకు ఇప్పటివరకు మృతుల సంఖ్య 13కి చేరగా, గాయపడిన వారి సంఖ్య 78గా ఉందని DG ISPR పేర్కొంది. గతంలో తమ సైనికులకు ప్రాణహాని జరగలేదని చెప్పిన పాక్, ఇప్పుడు నిజాలను ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.