తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26)లో మరో రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కళాశాలను మంజూరు చేస్తూ విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఇక పటాన్‌చెరులో 2023 జులైలో కళాశాలను ఉన్నత విద్యాశాఖ మంజూరు చేయగా.. దానికి 35 బోధన, బోధనేతర పోస్టులు, 17 మంది బోధనేతర సిబ్బంది మంజూరుకు జీవో జారీ చేసింది.