TG: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు మరణించిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలానగర్ మండలం మూతి ఘనపూర్ గ్రామ చెరువులో శివకుమార్ (48), యాదగిరి (22) గల్లంతయ్యారు. ఒక్కసారిగా శివకుమార్ మునుగుతుండడంతో యాదగిరి కాపాడే ప్రయత్నం చేశారు. అదుపు తప్పి ఇద్దరూ గల్లంతయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాల వెలికి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.