బాధితులకు పరిహారం అందించేందుకు రెండు బృందాలు

54చూసినవారు
బాధితులకు పరిహారం అందించేందుకు రెండు బృందాలు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులకు పరిహారం పంపిణీ కోసం టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. బోర్డు సభ్యులతో రెండు బృందాలను నియమించారు. మృతుల కుటుంబాలు, గాయపడిన వారికి ఆదివారం నుంచి ఈ బృందాలు పరిహారం చెక్కులు అందజేయనున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షలు చొప్పున, గాయపడిన 31 మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్