AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద లెవెల్స్‌ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన విషవాయువులను పీల్చడంతో చంద్రశేఖర్, కుమార్ అస్వస్థతకు గురై మృతి చెందారు. మరొక కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్స నిమిత్తం షీలానగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.