వేడి గంజిలో పడి రెండేళ్ల బాలుడు మృతి

21చూసినవారు
వేడి గంజిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
TG: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాధవరం శనివారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ముత్తి స్వామి, మహేశ్వరి దంపతుల కుమారుడు మోక్షిత్ (2) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు వేడి గంజిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఘోరంగా విలపిస్తున్నారు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్