గుజరాత్‌లోని సూరత్‌లో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. 18 గంటలైనా ఇంకా ఆ చిన్నారి మ్యాన్‌హోల్ నరకం చూస్తున్నట్లు తెలుస్తోంది. బాలుడిని రక్షించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.