యూపీలోని బదౌన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కోర్డుకోర్టు ఆవరణలో ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. తమను ఇద్దరు ముస్లిం యువకులు హిందువులుగా నమ్మించారని, తర్వాత మోసం చేశారని వారు పేర్కొన్నారు. పురుష సమాజంపై ద్వేషంతో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. దండలు మార్చుకుని ఇద్దరూ అందరి ముందే ఒక్కటయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.