డ్రైనేజీ నీటితో ప్లేట్లు శుభ్రం చేస్తున్న ఉడిపి హోటల్ సిబ్బంది

85చూసినవారు
హైదరాబాద్‌లో హోటల్ నిర్వాహకుల ఆగడాలకు అంతం లేదనిపిస్తుంది. తాజాగా యూసుఫ్‌గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్ సిబ్బంది నిర్వాకం బయటకు వచ్చింది. ప్రజలు తినే ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులను డ్రైనేజీ నీటితో కడుగుతున్నారు. కొన్నాళ్లుగా పైపుల నుంచి డ్రైనేజీ నీరు లీకవుతున్న.. హోటల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

సంబంధిత పోస్ట్